Yelamanchili: పదవ తరగతి కీలకం పట్టుదలతో శ్రమించండి: ప్రతాప్ రాజు
Yelamanchili: విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలక మలుపని, పట్టుదలతో శ్రమించి ఉత్తమ ఫలితాలు సాధించాలని విశ్రాంత ఉపాధ్యాయుడు పేరిచర్ల ప్రతాప్ రాజు సూచించారు.
Yelamanchili: పదవ తరగతి కీలకం పట్టుదలతో శ్రమించండి: ప్రతాప్ రాజు
Yelamanchili: యలమంచిలి మండలం కాజ గ్రామంలో జరిగిన కార్యక్రమం లో విద్యార్థి జీవితంలో పదవ తరగతి కీలక ఘట్టమని విద్యార్థులు పట్టుదల తో శ్రమించి మంచి ఫలితాలు సాధించాలని ప్రముఖ సాంఘిక సేవకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు పేరిచర్ల ప్రతాప్ రాజు అన్నారు.
మంగళవారం జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల, కాజ 10వ తరగతి విద్యార్థులకు నూతన పాఠశాల నిర్వహణ కమిటీ మరియు గ్రామ పెద్దల తో కలిసి సర్టిఫికెట్ ఫైల్స్ ను బహుకరించిన సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ పీర్ సాహెబ్ అధ్యక్షత వహించగా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జక్కం రాజు, గ్రామ పెద్దలు మాతా రత్నం రాజు, పీతల శ్రీనివాస్, కొప్పినీడి సర్వేశ్వర రావు, పాలంకి నాయుడు, సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




