Nidadavole: కంసాలిపాలెం బ్రిడ్జిని వెంటనే కట్టాలి: మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు
Nidadavole: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో ఎర్రకాలవ వరదను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు, తాము మంజూరు చేయించిన రూ.8 కోట్ల బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.
Nidadavole: కంసాలిపాలెం బ్రిడ్జిని వెంటనే కట్టాలి: మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు
తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో అర్నబ్ తుఫాన్ కారణంగా... ఎర్ర కాలవ పరిశీలించిన నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా తుఫాను కారణం వలన పెద్ద ఎత్తున వర్షాల గురవడంతో పెద్ద ఎత్తున నీరు ప్రవరిస్తుంది.
గతంలో పాత బ్రిడ్జి పడిపోయింది మేము అధికారంలో ఉండేటప్పుడు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వలన ఎలక్షన్ తర్వాత టెండర్లను పిలవలేదు పెండింగ్ ఉండిపోయింది. రైతులు ఇబ్బంది కాకుండా, కంసాలిపాలెం దాదాపు 200 మంది రైతులు అటు వెళ్లి పొలాల సాగు చేసుకోవడం ఉండేది.
కూటమి ప్రభుత్వంలో గతంలో మేము తీసుకొచ్చిన శాంక్షన్ లెటర్ తీసుకొచ్చే పని కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు మేము ఏదైతే ఈ బ్రిడ్జి కోసం 8 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాము.
ఈ పని కూడా చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం. మేము 8 కోట్ల శాంక్షన్ చేయించిన బ్రిడ్జిని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కట్టించాలని మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు మేము నిడదవోలులో పెద్ద ఎత్తున బ్రిడ్జి తీసుకొచ్చాం. రెండువందల కోట్ల రూపాయలతో బ్రిడ్జి తీసుకొచ్చాం, ఇంకొక 6 నెలల్లో బ్రిడ్జి పూర్తి కావస్తుంది.
ఇదే అధికారుల అధికారంలో మేము ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇక్కడ నేను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అయ్యుంటే ఇప్పటికీ కంసాలపాలెం 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే బ్రిడ్జి పూర్తి చేసేవాళ్లం అని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యఅవసరాల ధరలు పెరిగిపోయాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు పోటీ చేయుచున్నారు అభ్యర్థులను గెలిపించుకోవాలి, జగనన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు , కంసాలిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కొండపల్లి శీను గ్రామ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు.




