Bhimavaram: ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: ఎమ్మెల్యే!

Bhimavaram: భీమవరం నియోజకవర్గంలో 29 మంది లబ్ధిదారులకు రూ. 36.27 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 21 Sept 2026 8:10 PM IST
Bhimavaram
X

Bhimavaram: ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: ఎమ్మెల్యే!

భీమవరం: ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ఎంతో అండగా నిలుస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం 29 మంది లబ్ధిదారులకు రూ 36,27,500 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు.

ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని, ఇప్పటి వరకు భీమవరం నియోజక వర్గంలో 1060 మందికి రూ 8,44,15,406 లను అందించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య అవసరాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం , సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు.

ప్రభుత్వ భవిష్యత్తులో కూడా అవసరమున్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్ధసారధి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మెరగని నారాయణమ్మ, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, ఎఎంసి మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగ రాజు, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, బిజెపి పట్టణ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్ రావు, జనరల్ సెక్రటరీ గాదంశెట్టి వెంకటేశ్వరరావు, ఎం రాంబాబు, ఆకుల కృష్ణ, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM