Bhimavaram: పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుకు రూ. 22 లక్షలు: చైర్మన్ జుత్తిగ!
Bhimavaram: పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాలకు రూ. 22 లక్షల పుస్తకాలు. సెలవుల్లోనూ తెరిచేలా చర్యలు: చైర్మన్ జుత్తిగ నాగరాజు వెల్లడి.
Bhimavaram: పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుకు రూ. 22 లక్షలు: చైర్మన్ జుత్తిగ!
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, హాస్టల్ వార్డెన్స్, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అవసరమైన ఆన్‌డిమాండ్ పుస్తకాల కొనుగోలు కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.22 లక్షలు కేటాయించిందని చైర్మన్ శ్రీ జుత్తిగ నాగరాజు తెలిపారు. ఈ నిధులతో మొదటి విడతగా జిల్లాలోని గ్రంథాలయాలకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా భీమవరంలోని డాక్టర్ వై.ఎస్.ఆర్. మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయానికి పోటీ పరీక్షల ఆన్ డిమాండ్ పుస్తకాలను ఆయన అందజేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు అవసరమైన అప్‌డేటెడ్ పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సెలవు దినాల్లోనూ సేవలందించే దిశగా అడుగులు:
అదేవిధంగా అభ్యర్థుల సౌకర్యార్థం సెలవు రోజుల్లో కూడా భీమవరం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నామని చైర్మన్ గారు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా పుస్తకాల కొనుగోళ్లకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చైర్మన్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ గ్రంథి కుమార వెంకటేశ్వర వర ప్రసాద్ గారు, శ్రీ అల్లు శ్రీనివాస్ గారు మరియు శ్రీ జుత్తిగ రామకృష్ణ గారు, శ్రీ బొక్క సూరిబాబు గారు, శ్రీ జంపన ధనరాజు గారు, గ్రంథాలయ అధికారి శ్రీ ఎస్. వెంకటేశ్వరరావు గారు, రికార్డ్ అసిస్టెంట్ శ్రీ వి. సోమరాజు గారు మరియు పాఠకులు పాల్గొన్నారు.




