Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బసవ రామకృష్ణ ఖరారు!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు బసవ రామకృష్ణ పేరును కూటమి ఖరారు చేసింది.
Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బసవ రామకృష్ణ ఖరారు!
Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బసవ రామకృష్ణ పేరును ఖరారు చేశారు. ఇంతవరకు పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు కూటమి నుంచి చైర్మన్ అభ్యర్థి ఖరారు చేయడంతో తెరపడింది.
2014 మున్సిపల్ ఎన్నికల్లో 17 వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఆయన, అనంతరం తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కూటమిలో చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించినప్పటికీ అభ్యర్థి ప్రకటనపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్ఠానం బసవ రామకృష్ణ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా చైర్మన్ పీఠాన్ని కైవాసం చేసుకుంటామని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.




