Maruteru: మార్టేరులో క్రాఫ్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వ్యతిరేక అవగాహన!

Maruteru: మార్టేరులో క్రాఫ్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Oct 2026 12:14 PM IST
Maruteru
X

Maruteru: మార్టేరులో క్రాఫ్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వ్యతిరేక అవగాహన!

Maruteru: మార్టేరు గ్రామంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (క్రాఫ్) ఆధ్వర్యంలో బాల్య వివాహ వ్యతిరేకం పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రాఫ్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చి దిద్దడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా బాల్య వివాహాన్ని చేసిన యెడల చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

బాల్యవివాహాన్ని ఎవరైనా చేస్తున్నట్లయితే తెలిసిన యెడల ఉచిత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు, 112 కు లేదా గ్రామపంచాయతీ సెక్రటరీ, గ్రామ మహిళా సంరక్షణ అధికారికి మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని గ్రామ ప్రజలు అందించాలని కోరారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరం, బాల్య దశలో బాల బాలికలు వారి యొక్క హక్కును బాల్య దశ, విద్య, ఆరోగ్యం, కోల్పోకుండా మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ప్రజలకు అవగాహనను కల్పించడం జరిగింది. సచివాలయ సిబ్బంది స్వాతి, సలోమి, క్రాఫ్ మండల కోఆర్డినేటర్ సురేష్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు భాగ్యలక్ష్మి, అనంతలక్ష్మి, యజ్ఞకుమారి, రామలక్ష్మి, సుధారాణి, ధనలక్ష్మి, సరస్వతి, కళ్యాణి, సావిత్రి, భవానీదేవి, మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA