Attili: అత్తిలిలో రూ. 15.94 కోట్ల పనులకు శ్రీనివాస వర్మ, రాధాకృష్ణ శంకుస్థాపన
Attili: అత్తిలి మండలంలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు.
Attili: అత్తిలిలో రూ. 15.94 కోట్ల పనులకు శ్రీనివాస వర్మ, రాధాకృష్ణ శంకుస్థాపన
Attili: కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. అత్తిలి మండలంలో రూ. 15.94 కోట్లు విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపనలు, పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవాల చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.తణుకు నియోజకవర్గ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు) నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయించినట్లు వెల్లడించారు.
తన పదవీకాలం ముగిసేలోపు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ పనులకు మంజూరులు సాధించి పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు, అత్తిలి రైల్వే స్టేషన్‌లో పూరి ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
త్వరలో విశాఖ ఎక్స్‌ప్రెస్, శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా అత్తిలిలో హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నరసాపురం–నిడదవోలు ప్యాసింజర్ రైలును రాజమండ్రి వరకు పొడిగించే అంశాన్ని కూడాత్వరితగతిన ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు రూ.9 కోట్లతో రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయగా, ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో సుమారు రూ.4 కోట్లతో పూర్తయిన రహదారులను, అత్తిలిలో సుమారు రూ. కోటి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు,లయన్స్ క్లబ్, ప్రజల విరాళాల ద్వారా రూ.80 లక్షలతో ఏడు యూనిట్లతో ఆధునిక డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




