Narasapuram: రుస్తుంబాదలో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా అన్నపూర్ణేశ్వరి నామినేషన్!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద సర్పంచ్ కూటమి అభ్యర్థిగా ఎడ్లపల్లి కాశి అన్నపూర్ణేశ్వరి తాతాజీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Narasapuram: రుస్తుంబాదలో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా అన్నపూర్ణేశ్వరి నామినేషన్!
పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా ఎడ్లపల్లి కాశి అన్నపూర్ణేశ్వరి తాతాజీ స్థానిక గ్రామ సచివాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో వైస్ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉందని, ఆ సమయంలో గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేశామని తెలిపారు.
గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.




