Penumantra: మార్టేరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు - పాల్గొన్న కూటమి నేతలు!
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రధాని మోదీ సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవాలు. లబ్ధిదారులకు అవగాహన.
Penumantra: మార్టేరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు - పాల్గొన్న కూటమి నేతలు!
Penumantra: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల సేవా సంకల్ప అభియాన్లో భాగంగా మార్టేరు పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందిస్తున్న వివిధ సేవలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన, మిషన్ వాత్సల్య పథకాల గురించి వివరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.
ప్రీ-స్కూల్ పిల్లల తల్లులు, గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా తాము పొందుతున్న సేవలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు అందిస్తున్న సేవలను వివరించారు.
అనంతరం అంగన్వాడీ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అంగన్వాడీ కార్యకర్తలు, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను అభినందిస్తూ, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు సీడీపీవో అంగర కృష్ణకుమారి, అంగన్వాడీ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కోనాల శ్రీనివాసరెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తమనంపూడి శ్రీనివాస్ రెడ్డి (బుల్లా), బీజేపీ నాయకులు కే.హెచ్.వి. ప్రసాదరెడ్డి, జనసేన సభ్యులు ఆలీ, ప్రసాద్, కూటమి నాయకులు ఎం అచ్యుత రావు , కారిపల్లి భాస్కరరావు ,పిసిని అప్పలనాయుడు, మండూరి రాజేష్, గిరజాల రాజేష్, రావుల సూర్యారావు, చిలికే డూండి పంచాయతీ సెక్రెటరీ కే సత్యనారాయణ అంగన్వాడి సూపర్వైజర్ సూర్యకుమారి,అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




