Narasapuram: నరసాపురంలో కూటమి హవా: చైర్‌పర్సన్‌గా శ్రీశైలజ విజయం
Narasapuram: నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి కొత్తపల్లి శ్రీశైలజ 1,769 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 36 వార్డుల్లో కూటమి 31 స్థానాలు గెలుచుకుంది.
Narasapuram: నరసాపురంలో కూటమి హవా: చైర్‌పర్సన్‌గా శ్రీశైలజ విజయం
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగింది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో జనసేన 15, టీడీపీ 15, వైసీపీ 4, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో కూటమి అభ్యర్థి కొత్తపల్లి శ్రీశైలజ, వైసీపీ అభ్యర్థి కావలి రామసీతపై 17,069 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
ఇక ఓట్ల వివరాలను పరిశీలిస్తే.. జనసేనకు 24,580 ఓట్లు, వైసీపీకి 7,511 ఓట్లు, కాంగ్రెస్‌కు 262 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 246 ఓట్లు రాగా, 765 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఫలితాలతో కూటమి శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగురవేయడంతో నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు.




