Penugonda: ఇలపర్రు సర్పంచ్ అభ్యర్థిగా మంగం బాలకృష్ణకు కూటమి మద్దతు!
Penugonda: పెనుగొండ మండలం ఇలపర్రు సర్పంచ్ అభ్యర్థిగా మంగం బాలకృష్ణను, పెనుగొండ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావును ఎమ్మెల్యే పితాని, కూటమి నాయకులు బలపరిచారు.
Penugonda: ఇలపర్రు సర్పంచ్ అభ్యర్థిగా మంగం బాలకృష్ణకు కూటమి మద్దతు!
పెనుగొండ: పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామ సర్పంచ్అభ్యర్థిగా మంగం బాలకృష్ణను ను ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు కూటమి నాయకులు బలపరిచారు. ఆయన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినట్లు తెలిపారు. ఇలపర్రు గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




