Akividu: సిద్దాపురం సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ మహేష్ వర్మ సతీమణి పోటీ

Akividu: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ వర్మ సతీమణి ప్రణీత పోటీ.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 23 Nov 2026 6:08 PM IST
Akividu
X

Akividu: సిద్దాపురం సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ మహేష్ వర్మ సతీమణి పోటీ

​ఆకివీడు: ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామ సర్పంచ్ స్థానానికి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కలిదిండి మహేష్ వర్మ సతీమణి ప్రణీత పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించిన వివరాలను డాక్టర్ మహేష్ వర్మ మీడియాకు వెల్లడించారు.

​ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆశీస్సులతో ఈ స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు డాక్టర్ మహేష్ వర్మ తెలిపారు. గత ఏడేళ్లుగా సిద్దాపురం గ్రామంలో తమ కుటుంబం ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

​గ్రామ ప్రజలకు మరింత చేరువై సేవ చేసేందుకు ఈ ఎన్నికలను ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మహేష్ వర్మ అన్నారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సిద్దాపురం ఓటర్లు తమకు అండగా నిలవాలని, తమ అభ్యర్థి ప్రణీతకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM