Achanta: 21వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ, పోస్ట్‌కార్డుల నిరసన
Achanta: ఆచంట నియోజకవర్గంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ 21వ రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు పోస్ట్‌కార్డులు రాసి నిరసన తెలిపారు.
Achanta: 21వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ, పోస్ట్‌కార్డుల నిరసన
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం 4 మండలాల వీఆర్ఏల సహాయ నిరాకరణ మంగళవారం నాటికి 21 రోజుకి చేరింది. దీనిలో భాగంగా వినూత్నంగా వీఆర్ఏలు పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ కార్డులు రాసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పంపించారు.
పోడూరు మండల వీఆర్ఏ ల సంఘం అధ్యక్షుడు బెల్లాని ప్రకాశరావు, పెనుగొండ వీఆర్ఏల అధ్యక్షుడు తానేటి నాగరాజు ఉపాధ్యక్షుడు ఖండవల్లి బాల బాలాజీ, పోడూరు మండల ఉపాధ్యక్షులు, పి సూర్యనారాయణ, నియోజవర్గంలోని వీఆర్ఏలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.




