Achanta: ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి: ఆచంటలో ధర్నా

Achanta: కోట్లాది ఓట్లు తొలగించారంటూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రైతు, కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి.

E.ABRAHAM, ACHANTA
Published on: 10 Oct 2026 9:44 PM IST
Achanta
X

Achanta: ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి: ఆచంటలో ధర్నా

Achanta: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలని రైతు, కార్మిక సంఘాల ఆందోళన, దేశంలో అప్రజాస్వామ్యంగా రాజ్యాంగన్ని ఉల్లంగించి కోట్లాది మంది ఓట్లు తొలగించిన కేంద్ర ఎన్నిల ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే తొలగించారని దేశ వ్యాప్తంగా ఆందోళనలో బాగంగా రైతు, కార్శిక సంఘాల ఆద్వర్యంలో ఆచంట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

ఈసందర్బంగా ఏపి కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమీషనర్ కి వున్న అధికారం ప్రజలకు జవాబు దారీగా వ్యవహరించి పౌరులకు ఓటు హక్కు కల్పించడమేనని ఓటు తొలగించడం కాదని విమర్శించారు.

రాజ్యాంగాన్ని ఉల్లంగించి ఫారం 6 లో వ్యక్తి గతంగా మార్పులు చేసి, పదమూడు కోట్ల మంధి ఓట్లు తొలగించిన జ్ఞానేష కమార్ని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ ద్వారా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా బిజెపిని గద్దె దించేవరకు పోరాడాలని, జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే పదవి నుండి తొలగాంచాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సి. ఐ. టి. యు, కౌలురైతు, వ్యకాస నాయకులు కలుపూరి బుల్లబ్బాయి,దాసిరెడ్డి కోటేశ్వరరావు జయరాజు, కేతా నాగ ఆంజనేయులు, కేతా పూర్ణారావు, కొండేటి సురేష్, బండి శ్రీనివాసు, బొక్కా సూర్యనారాయణ,పద్మారావు,మల్లుల వెంకటేశ్వర్లు తధితరులు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA