Achanta: పోడూరులో 5వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ!
Achanta: పోడూరులో 5వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం. తహసీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, వీఆర్వోలు సంఘీభావం.. పే స్కేల్, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్.
Achanta: పోడూరులో 5వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ!
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గం లోని పోడూరు మండలంలో, వీఆర్వోలసహాయనిరాకరణ ఉద్యమం 5.వ.రోజుకు చేరింది.. ఈ సందర్భంగా వి ఆర్ ఏ లకు మండల తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, మండల వీఆర్వోలు ఆఫీసు సిబ్బంది వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు.
వీఆర్ఏల సహాయం నిరాకరణ ఐదవ రోజు చేరడంతో విఆర్వోలు వీఆర్ఏలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా,మండల వీఆర్ఏల అధ్యక్షుడు ప్రకాశరావు తహసిల్దార్ కి మండల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రకాశరావు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లనుప్రభుత్వంవెంటనే పరిష్కరించాలంటూ ఏళ్ల తరబడి గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
అర్హత, అనుభవం కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినీ వీఆర్ఏలనుక్రమబద్ధీకరించడంతోపాటుపదోన్నతులకుసంబంధించినసమస్యలనుపరిష్కరించాలనిచాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించడం వీఆర్ఏలకు కష్టంగా మారిందన్నారు.
నిత్యావసర సరుకుల ధరలుఆకాశాన్నంటుతున్నప్పటికీ వీఆర్ఏల జీతాలు మాత్రంఅంతంతమాత్రంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన జీతంతోకుటుంబాన్ని పోషించుకోవాలా..అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి ఖర్చులు భరించలేని పరిస్థితినెలకొందన్నారు.
ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను ఇకనైనా పట్టించుకుని న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, కందుల రాంబాబు, డిప్యూటీ తహసీల్దారు కే వి వి సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ జి. కృపారాజు, టైపిస్ట్ రాపాక సునీల్, వీఆర్వో శ్రీపాద కుమార్, యన్.వి. చలం, ఆర్ స్వామి, వి. వర్మ, కె. శ్రీనివాస్, సిహెచ్ శేఖర్, నాగమణి, జీవీఎస్ నాగరాజు, జీవీఎస్ బాబా, బి.ఇందిరా,బి.లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.




