Achanta: జాతీయ గృహ ఆదాయ సర్వే 2026 నియామక పత్రాల అందజేత
Achanta: ఆచంట మండలంలో జాతీయ గృహ ఆదాయ సర్వే 2026 నిర్వహణకు సర్వేయర్లను నియమించారు. ఈ సర్వే సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడుతుందని ఎంపీడీఓ తెలిపారు.
Achanta: జాతీయ గృహ ఆదాయ సర్వే 2026 నియామక పత్రాల అందజేత
ఆచంట: కేంద్ర గణాంక శాఖ ద్వారా మండలంలోని ఆచంట, ఆచంట వేమవరం గ్రామాలలో జాతీయ గృహ ఆదాయ సర్వే 2026 నిర్వహించడానికి కే ప్రసాద్, వి జేమ్స్ ను నియమించారు. ఈ రోజు వీరు ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ కు వారి నియామక పత్రాలు అందచేశారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ మాట్లాడుతూ ఈ శాంపిల్ సర్వే వలన బహుళ ప్రయోజనాలు ఉంటాయని, సర్వే జాగ్రత్త గా నిర్వహించాలన్నారు. ఈ సర్వే సంక్షేమ పథకాల రూప కల్పన, ఆర్థికంగా వెనుకబడిన విభాగాలు గుర్తింపు, ప్రాంతీయ వ్యత్యాసాలు గుర్తింపు.
జాతీయ అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన వంటి వాటిలో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి కృష్ణ మోహన్, సహాయ గణాంక అధికారి మల్లేశ్వర రావు, సర్వేయర్స్ కే ప్రసాద్, వి జేమ్స్ పాల్గొన్నారు.




