Marteru: గంజాయి నిర్మూలన.. యువత భవిత రక్షణే లక్ష్యం!
Marteru: గంజాయిని నిర్మూలించండి - దేశ భవిష్యత్తును కాపాడండి: ఈనెల 30న మార్టేరు నుంచి ఆచంట వరకు భారీ 8K రన్, పాల్గొననున్న ఎమ్మెల్యే పితాని, కలెక్టర్ నాగరాణి.
Marteru: గంజాయి నిర్మూలన.. యువత భవిత రక్షణే లక్ష్యం!
మార్టేరు: గంజాయిని నిర్మూలించండి.. మన దేశ భవిష్యత్తును కాపాడండి” అనే నినాదంతో 8K రన్‌కు శ్రీకారం చుట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మార్టేరు నుంచి ఆచంట వరకు ౮క్ ఈనెల 30 వ తేదీన బుధవారం యూత్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రన్ నిర్వహించనున్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం అన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు యూత్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకుల విజ్ఞప్తి. మార్టేరు నుంచి ఆచంట వరకు 8K రన్‌లో యువత భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కూడా 8K రన్‌లో పాల్గొంటారని యూత్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.




