Achanta: కూటమి సంక్షేమమే మా విజయతీరం టీడీపీ అభ్యర్థి నరసింహమూర్తి

Achanta: ఆచంట మండలం వేమవరంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బీరా నరసింహమూర్తి మీడియా సమావేశం. కూటమి పాలన, సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలని ధీమా.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 Nov 2026 9:38 PM IST
Achanta
X

Achanta: కూటమి సంక్షేమమే మా విజయతీరం టీడీపీ అభ్యర్థి నరసింహమూర్తి

ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట మండలంలోని వేమవరం గ్రామంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బీరా నరసింహమూర్తి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉప్పలపాటి సురేష్‌బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రధాన బలంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కూటమికి అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగానే గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

జగన్‌ ఎన్ని రాజకీయ కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కనీసం 11 సీట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైసీపీ నాయకులు తట్టాబుట్టా సర్దుకుని బెంగళూరులోని ప్యాలెస్‌కు వెళ్లిపోవాల్సిందేనని విమర్శించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA