Achanta: ఎమ్మెల్యే పితానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

Achanta: ఆచంటలో జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.

E.ABRAHAM, ACHANTA
Published on: 3 Oct 2026 8:44 PM IST
Achanta
X

Achanta: ఎమ్మెల్యే పితానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం అక్టోబర్ 2 జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణకు ఆచంట నియోజకవర్గ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు, (APUWJ,IJU)సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర పరిధిలోని నియోజకవర్గల స్థాయి జర్నలిస్టుల ఇబ్బందులను తెలియజేస్తూ జర్నలిస్టులు ఎదుర్కొనే పలు సమస్యలను వెంటనే భర్తీ చేసి, ఇళ్ల స్థలాలు మంజూరు కానీ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అలాగే జాతీయ రైల్వే పాసులకు సంబంధించి 50 శాతం రాయితీ కల్పించాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సంబంధించి సంపూర్ణంగా అమలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి చర్యలు చేపట్టాలని నియోజకవర్గ మరియు ఆయా మండలాలలో జర్నలిస్టుల పై జరిగే దాడులను అరికట్టాలని, ఆచంట నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ పునః ప్రారంభానికి సంబంధించిన నిధులు కేటాయించాలని కోరుతూ ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణకి శుక్రవారం ఉదయం వినతిపత్రం సమర్పించడం జరిగింది..

సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జర్నలిస్టు సోదరుల న్యాయమైన కోరికలు, హామీలు తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు ఆనందోత్సాహాల నడుమ పితానికి ధన్యవాదాలు తెలియజేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA