Mahabubabad: డోర్నకల్‌లో 26 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో బార్ అండ్ రెస్టారెంట్ క్యాషియర్ పోతు మల్లికార్జున్(26) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Mahabubabad: డోర్నకల్‌లో 26 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని మూడో మెయిన్ రోడ్ లోని బార్ అండ్ రెస్టారెంట్లో క్యాషియర్ గా పనిచేస్తున్న పోతు మల్లికార్జున్(26) రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడిది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంగా తెలుస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఘటనపై సమగ్ర సమాచారం అందవలసి ఉంది.




