Warangal: యువత ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు మంచి వేదికలు: కలెక్టర్!

Warangal: యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు మంచి వేదికలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఎల్.బి. కళాశాలలో తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 27 Nov 2026 6:01 PM IST
Warangal
X

Warangal: యువత ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు మంచి వేదికలు: కలెక్టర్!

Warangal: యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు మంచి వేదికలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్‌లోని ఎల్.బి. కళాశాలలో యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. యువతలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీశాల ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమలోని సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలాజీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్, ఎల్.బి. కళాశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, నెహ్రూ యువ కేంద్రం (NYK) కోఆర్డినేటర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST