Nadikuda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం: యూత్ కాంగ్రెస్!

Nadikuda: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నడికూడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మర స్వామి పిలుపునిచ్చారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 5 Oct 2026 9:13 PM IST
Nadikuda
X

Nadikuda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం: యూత్ కాంగ్రెస్!

నడికూడా: నడికూడా మండలం రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని యూత్ కాంగ్రెస్ నడికూడా మండల ప్రెసిడెంట్ అప్పం కుమ్మర స్వామి పిలుపునిచ్చారు.

మండలంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, యువతకు ఉద్యోగ అవకాశాలను గ్రాడ్యుయేట్ ఓటర్లకు వివరించాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా ఉందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL