Warangal: నృత్యంలో రాణిస్తున్న చిన్నారి శ్రీసంహిత జాతీయ స్థాయిలో అవార్డు!
Warangal: కూచిపూడి, జానపద నృత్యంలో రాణిస్తున్న చిన్నారి శ్రీసంహిత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలు బహుమతులు సాధించి అరుదైన ప్రతిభ కనబరుస్తోంది.
Warangal: నృత్యంలో రాణిస్తున్న చిన్నారి శ్రీసంహిత జాతీయ స్థాయిలో అవార్డు!
Warangal: శ్రావణి - నరేందర్ దంపతుల కుమార్తె శ్రీసంహిత కూచిపూడి, జానపద నృత్యంలో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధిస్తోంది. 6వ తరగతి చదువుతున్న చిన్నారి ఐదేళ్లుగా కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతూ ఇప్పటి వరకు 100 కు పైగా ప్రదర్శనలు ప్రముఖ పుణ్యాకేత్రాలలో ( తిరుపతి, యాదాద్రి, వేములవాడ తదితర ) కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం తన ప్రతిభ పాఠవాలను చాటుకుంది.
తనకు ఎవరు సాటి రారు అన్న చందంగా ఆమె ఆహుతులను ఆకట్టుకుంటూ ముందుకు వెళుతుంది.
సెప్టెంబర్ 26,27 తేదీలలో హైదరాబాద్ లో సనాతన నృత్య కళా విభాగం జేఏసీ నిర్వహించిన జాతీయ స్థాయి జానపద నృత్య పోటీల్లో పాల్గొని MLC శ్రీ బొగ్గారాపు దయానందు గారి చేతుల మీదుగా ద్వితీయ బహుమతి అందుకుంది.
2026 ఆగస్టులో 6, 7, 8, 9 తేదీల్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవ స్థానం విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జూనియర్ విభాగంలో తృతీయ బహుమతి అందుకుంది. వరంగల్ కు చెందిన ఎన్సీ ఎన్ కళాక్షేత్రం గురువు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొంది తన ప్రతిభతో అనేక ప్రదర్శనలతో అవా ర్డులు సొంతం చేసుకుంటూ మన్ననలు పొందుతోంది.




