Bayyaram: యాసంగి సాగులో రైతులకు అవగాహన: ఏవో రాజు సూచనలు

Bayyaram: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా యాసంగిలో వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని బయ్యారం మండల వ్యవసాయ అధికారి రాజు రైతులకు సూచించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 7 Nov 2026 5:39 PM IST
Bayyaram
X

Bayyaram: యాసంగి సాగులో రైతులకు అవగాహన: ఏవో రాజు సూచనలు

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలంలోని కాచనపల్లి గ్రామాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు సందర్శించి, యాసంగి పంటల సాగు కోసం తమ వ్యవసాయ భూములను సిద్ధం చేసుకుంటున్న రైతులను కలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతూ.., ప్రస్తుతం అనుసరిస్తున్న పంటల సాగు విధానాలు, గత పంటల అనుభవాలు, సాగునీటి లభ్యత తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఎల్‌నినో ప్రభావానికి అనుకూలంగా ఉండి, రాబోయే యాసంగి సీజన్‌లో నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

ముఖ్యంగా అధిక నీటి అవసరం కలిగిన వరి సాగుకు బదులుగా, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, శనగ, జొన్న, నువ్వులు తదితర పంటలను సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.

అలాగే ప్రతి రైతు తమ భూమి స్వభావం, నేలలో తేమ, బోర్లు మరియు ఇతర నీటి వనరుల లభ్యతను అంచనా వేసుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, నీటి వనరులపై ముందస్తు ప్రణాళిక లేకుండా వరి సాగుకు వెళ్లవద్దని సూచించడం జరిగింది.

వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, సాగు ఖర్చులను నియంత్రించడం ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని వివరించడం జరిగింది.

ఈ ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని లాభదాయకమైన యాసంగి సాగు చేపట్టాలని సూచించడం జరిగింది.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM