Jangaon: ఆఫీసుకు వస్తే నరకం.. మహిళా ఉద్యోగుల ఆవేదన!
Jangaon: స్టేషన్ ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారి వేధింపులతో విధులు నిర్వహించలేకపోతున్నామంటూ ఇద్దరు మహిళా ఉద్యోగినులు కన్నీటిపర్యంతమయ్యారు.
Jangaon: ఆఫీసుకు వస్తే నరకం.. మహిళా ఉద్యోగుల ఆవేదన!
Jangaon: మండల ప్రజా పరిషత్ కార్యాలయం.. మహిళా ఉద్యోగినులకు నరకంగా మారిందా? ఎంపీడీవో తీరుతో ప్రశాంతంగా విధులు నిర్వహించలేకపోతున్నామంటూ ఇద్దరు మహిళా ఉద్యోగినులు ఆందోళన చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
వాయిస్ ఓవర్: స్టేషన్ ఘనపూర్ MPDO కార్యాలయ ఉద్యోగులు సీనియర్ అసిస్టెంట్ మయూరి, టైపిస్ట్ సంఘమిత్ర లు తమ ఆవేదనను వెళ్లగక్కారు. మాట్లాడుతూనే కన్నీటిపర్యంతమయ్యారు. "ఆఫీసుకు వస్తే చాలు.. ఎంపీడీవో ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ గొడవకు దారితీస్తున్నారు. గత ఆరు నెలలుగా ఇదే తంతు" అని వారు ఆరోపించారు.
తమ వద్దకు వచ్చిన ప్రజాపాలన పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేస్తున్నామని, కానీ గతంలో పనిచేసిన సిబ్బంది సరిగా నిర్వహించని పాత రికార్డులకు తమను బాధ్యుల్ని చేస్తున్నారని వాపోయారు. రికార్డుల నిర్వహణ, సంతకాల ప్రక్రియలో సరైన విధానం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.




