Parkal: బస్టాండ్ కూడలిలో మహిళ ధర్నా.. స్కూల్ వ్యాన్ నిరాకరణపై ఆందోళన!
Parkal: పరకాల బస్టాండ్ కూడలిలో ఫీజు చెల్లించలేదని పాఠశాల వ్యాన్ ఎక్కించలేదంటూ ఓ మహిళ ఆందోళన చేపట్టింది. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
Parkal: బస్టాండ్ కూడలిలో మహిళ ధర్నా.. స్కూల్ వ్యాన్ నిరాకరణపై ఆందోళన!
Parkal: పరకాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన కుమారుడిని పాఠశాల వ్యాన్ లో తీసుకోలేదని, ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఫీజు చెల్లించలేదంటూ బయటికి వెళ్లాలని దురుసుగా ప్రవర్తించారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో తనకు న్యాయం చేయాలంటూ బస్టాండ్ కూడలిలో ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, ధర్నా చేస్తున్న మహిళను పరకాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయంపై విచారణ జరుపుతున్నారు.




