Station Ghanpur: జీవో 97ను వెంటనే రద్దు చేయాలి: స్టేషన్ ఘన్‌పూర్‌లో ధర్నా
Station Ghanpur: స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జీవో 97కు వ్యతిరేకంగా అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 34వ రోజుకు చేరాయి.
Station Ghanpur: జీవో 97ను వెంటనే రద్దు చేయాలి: స్టేషన్ ఘన్‌పూర్‌లో ధర్నా
స్టేషన్ ఘనపూర్: జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్టేషన్ ఘనపూర్‌లో అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన నిరసన 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జీవో 97కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను ఉద్ధృతం చేశారు. జీవోను వెంటనే ఉపసంహరించుకుని విద్యార్థులు, అధ్యాపకులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
34 రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో నిరసనల్లో పాల్గొనాల్సి వస్తోందని, జీవో 97పై కొనసాగుతున్న జాప్యం వారి చదువు, విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవో 97పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ చర్చలను త్వరగా పూర్తి చేయాలని జేఏసీ కోరింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. సమస్యను మరింత కాలయాపన చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పేర్కొంది.
విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల న్యాయమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధ్యాపకులు, విద్యార్థులు కోరారు. జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి, అధ్యాపకులు బోధించే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.




