Rayaparthi: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వెస్ట్‌జోన్‌ డీసీపీ!

Rayaparthi: రాయపర్తి మంచినీళ్ల చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు.

P ASHOK, WARDHANNAPET
Published on: 23 Sept 2026 5:17 PM IST
Rayaparthi
X

Rayaparthi: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వెస్ట్‌జోన్‌ డీసీపీ!

Rayaparthi: గణపతి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ సూచించారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువు పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, రద్దీని నియంత్రిస్తూ కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీసీపీ సూచించారుఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సంజీవరావు, ఎస్సై ముత్యం రాజేందర్‌, స్థానిక సర్పంచ్‌ గారే సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి యాకూబ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET