Warangal: వ్యాపారి బుద్ధరఘు కుటుంబానికి పరపతి సంఘం భరోసా!
Warangal: వరంగల్ కూరగాయల మార్కెట్ వ్యాపారి బుద్ధరఘు అకాల మరణానికి సంతాపంగా వారి కుటుంబానికి వ్యాపారస్తుల పరపతి సంఘం తరపున రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.
Warangal: వ్యాపారి బుద్ధరఘు కుటుంబానికి పరపతి సంఘం భరోసా!
వరంగల్: వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ కమిషన్ వ్యాపారి బుద్ధరఘు అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల పరపతి సంఘం ఆధ్వర్యంలో వారి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.
సంఘం అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ కసర్ల రాజుతో పాటు యుగంధర్, బూరుగుపల్లి శ్రీనివాస్, పాటల రవి, భద్రయ్య, నేపాల్ రాజు, బబ్బూరి నరేష్, అమర్, వడ్డే నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.




