Warangal: మద్యం తాగి వాహనం నడపొద్దు: ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ

Warangal: వరంగల్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 150 మంది వాహనదారులకు హన్మకొండ టీటీఐలో ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ కౌన్సెలింగ్ ఇచ్చారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 21 Sept 2026 2:24 PM IST
Warangal
X

Warangal: మద్యం తాగి వాహనం నడపొద్దు: ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ

Warangal: రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం మరియు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రజలను చైతన్యపరచడం కోసం హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో నెలకొల్పబడిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(TTI) లో ట్రాఫిక్ ACP T. సత్యనారయణ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సుమారు 150 మంది వాహనదారులకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారికి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణనష్టం మరియు చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించిన అనంతరం వాహనం నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర వాహనదారులు, ప్రయాణికులు మరియు పాదచారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, మైనర్ లను వాహనాలు నడుపుటకు అనుమతించవద్దని, ఒకవేళ మైనర్ లు వాహనం నడిపి పోలీసులకు పట్టుబడినట్లైతే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలుంటాయని, “మద్యం సేవించి వాహనం నడపవద్దు – సురక్షితంగా ప్రయాణించండి, ప్రాణాలను కాపాడుకోండి” అని వాహణదారులను ACP విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమమలో RSI నవీన్ కుమార్ SI వేణుగోపాల్ రెడ్డి , మహిళా కానిస్టేబుల్ అరుణ మరియు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.