Warangal: పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు టీపీయూఎస్ భరోసా!

Warangal: మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన పేద పద్మశాలి విద్యార్థిని వైష్ణవికి ఐదేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు TPUS వరంగల్ జిల్లా విభాగం ముందుకొచ్చింది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 26 Oct 2026 10:00 PM IST
Warangal
X

Warangal: పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు టీపీయూఎస్ భరోసా!

వరంగల్: నిరుపేద కుటుంబానికి చెందిన పద్మశాలి విద్యార్థిని కొంతం వైష్ణవి ఎంబీబీఎస్ చదువుకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) వరంగల్ జిల్లా తరఫున ఐదేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చింది.

వరంగల్‌లో ఈరోజు నిర్వహించిన POPA పద్మశాలి ప్రతిభా పురస్కార ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన కొంతం వైష్ణవి తనకు మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని, తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సహాయం అందించాలని కోరింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, సంఘం తరఫున విద్యార్థినికి ఐదేళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి సంవత్సరం రూ.29,000 చొప్పున ఐదేళ్లకు సంబంధించిన ట్యూషన్ ఫీజును చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సంఘం తరఫున ఫీజు చెల్లించనున్నట్లు వెల్లడించారు.

ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన పేద విద్యార్థుల వైద్య విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది. నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో వైద్యులుగా ఎదిగే యువతకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు, POPA రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్, TPRUS వరంగల్ జిల్లా అధ్యక్షులు బిట్ల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు కామేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చేరాల మురళీకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్, జిల్లా సంస్థాగత కార్యదర్శి కొండబత్తుల రాజమౌళి,

జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గోరంట్ల అశోక్, ప్రచార కార్యదర్శి కోడూరి రమేష్, క్యాతం ఆనందరావు, నాయకులు గోషికొండ సుధాకర్, పాము శ్రీనివాస్, మాటేటి అశోక్ కుమార్, మాటేటి సంతోష్, బైరి శ్యాంసుందర్,రాజగోవిందుతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ శ్రీ బేతి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు చేయూతనిస్తూ, సమాజ అభ్యున్నతికి సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST