Warangal: మామునూరు ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన హుస్సేన్ నాయక్

Warangal: మామునూరు ఎయిర్‌పోర్ట్ వద్ద భూ వివాదాలపై అధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సమీక్ష.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Nov 2026 3:59 PM IST
Warangal
X

Warangal: మామునూరు ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని పరిశీలించిన హుస్సేన్ నాయక్

వరంగల్: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు సందర్శించినా జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ మెంబర్ హుసైన్ నాయక్

హుస్సేన్ నాయక్ కామెంట్స్ :

మామునూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ మీడియాతో సమావేశం. * SC-ST భూములకు సంబంధించి సిబ్బంది వర్గం వారు కంప్లైంట్ చేసిన సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులతో విచారణ చేసి చర్చించడం జరిగిందని తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సభ్యుల స్థల వివాదం పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తర్వాత మామునూరు ఎయిర్‌పోర్ట్ కి ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు.

నిజాం నవాబు కాలంలో ఏర్పడిన ఎయిర్‌పోర్ట్ మూతపడడం, మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా సంతోషదాయకం అని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు ఇది చాలా శుభసూచకం అని తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ కి సంబంధించిన స్థలం కబ్జాకు గురికావడం జరిగిందని, దీనికి ఎయిర్‌పోర్ట్ అధికారుల మొద్దు నిద్రే కారణమని, దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కమిషన్ కి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరలోనే పరిష్కారం చేయాలని సూచించారు

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.