Warangal: వరంగల్‌లో నిరుపేద కుటుంబానికి సామాజిక సేవా సంస్థ చేయూత

Warangal: వరంగల్‌ 20వ డివిజన్‌కు చెందిన వేల్పుకొండ యాకూబ్ మృతి చెందగా, ఆయన కుటుంబానికి సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు ఎలుకపెల్లి శ్రీధర్ బియ్యం అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Oct 2026 6:16 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో నిరుపేద కుటుంబానికి సామాజిక సేవా సంస్థ చేయూత

వరంగల్: ఇటీవల అనారోగ్యంతో గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ కి చెందిన వేల్పుకొండ యాకుబ్ మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలుకపెల్లి శ్రీధర్ తన స్నేహితుడు కవి సహకారంతో శుక్రవారం రోజునా కుటుంబాన్ని పరామర్శించి వారికి 25, కిలోల బియ్యం అందించడం జరిగింది.

శోకసముద్రంలో మునిగి ఉన్న కుటుంబాన్ని పరామర్శించే తోచిన విధంగా వారిని ఆదుకోవడం మానవత్వం అని కుటుంబాన్ని ఆదుకోవడం తమ బాధ్యతలని సంస్థ నిర్వాహకుడు శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవా సంస్థకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్