Warangal: ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు అంగీకరించిన ఆరు ఆసుపత్రులు

Warangal: వరంగల్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుకు ముందుకు వచ్చిన ఆరు ఆసుపత్రులు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Oct 2026 7:59 PM IST
Warangal
X

Warangal: ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు అంగీకరించిన ఆరు ఆసుపత్రులు

వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన గురువారం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health Scheme – EHS) అమలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ అమలుకు సంబంధించిన అంశాలపై ఆసుపత్రుల ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి సమన్వయం తో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని ఆరు ఆసుపత్రుల ప్రతినిధులు తమ ఆసుపత్రులలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేసేందుకు అంగీకారం తెలిపారు.

ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పథకం ద్వారా అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్‌పై చర్చ

సమావేశంలో తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం అమలు, ఆసుపత్రులు పాటించాల్సిన నిబంధనలు, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.

ఆసుపత్రులు సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. వర్తించే నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ అనుమతులు, ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (Fire NOC) పొందడం ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలును విస్తరించడంతో పాటు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో నిబంధనల అమలు, భద్రతా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సమావేశంలో పాల్గొన్న మరియు ఈ ఎచ్ ఎస్ అమలుకు అంగీకరించిన ఆసుపత్రుల ప్రతినిధులు.

1. సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ – డాక్టర్ బందెల మోహన్ రావు

2. గంగా హాస్పిటల్ – డాక్టర్ శ్రవణ్ కుమార్

3. క్యూర్ వెల్ హాస్పిటల్ – డాక్టర్ వి. రాకేష్

4. సత్య హాస్పిటల్ – డాక్టర్ రాధాకృష్ణ

5. బాలాజీ హాస్పిటల్ – డాక్టర్ శ్రీనివాసరావు

6. ఎన్.ఎస్.ఆర్. అపోలో హాస్పిటల్ – మేనేజర్ సుమన్

అలాగే ఈ సమావేశంలో డి ఎం ఎచ్ ఓ డా.రాజా రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రతినిధులు డాక్టర్ సంపత్ (నర్సంపేట), డాక్టర్ జాన్సన్ (నర్సంపేట), డాక్టర్ జి. రమేష్, డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ వి.ఎం. జైయుడు, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ నిఖిల్ స్వరూప్, ఎస్ ఓ ప్రసన్న కుమార్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.