Warangal: వరంగల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

Warangal: వరంగల్‌లో మహిళా భద్రత, టీ-సేఫ్ యాప్‌పై షీ టీమ్ ఎస్సై రామారావు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 15 Oct 2026 4:41 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

వరంగల్: నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు గారు అన్నారు.

వరంగల్ లోని కరీంబాద్ వరంగల్ లో కాసం షాపింగ్ మాల్ గోదాం నందు దాదాపు 150మంది స్టాప్ కి సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు.

ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు గారు మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని మరియు మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరు టీ-సేఫ్ ఆప్ ను ఉపయోగించుకోవాలని, టీ-సేఫ్ ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు.

ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాసం షాపింగ్ మాల్ గోదాం వరంగల్ ఇంచార్జి రాహుల్ షీ టీమ్ ఎస్సై రామారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST