Warangal: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం: వరంగల్ ఆర్టీఓ సదస్సు!
Warangal: వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పీఎం-రహత్, పీఎం-రహవీర్ పథకాలపై వాహనదారులకు డీటీసీ రంగారావు, ఎంవీఐ శోభన్ కుమార్ సమగ్ర అవగాహన కల్పించారు.
Warangal: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం: వరంగల్ ఆర్టీఓ సదస్సు!
వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంపై వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రహత్ (PM-RAHAT), పీఎం-రహవీర్ (PM-RAHVEER) పథకాలపై డీటీసీ రంగారావు, ఎంవీఐ శోభన్ కుమార్ వాహనదారులకు వివరించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించడం, క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.




