Warangal: రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ అశోక్ బాబుకు ఘన సన్మానం!
Warangal: వరంగల్ రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందజేశారు.
Warangal: రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ అశోక్ బాబుకు ఘన సన్మానం!
వరంగల్: రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు రొటేరియన్ సోమ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ చిరంజీవి చేతన్ శౌర్యకు క్రీడల్లో మరింత రాణించేందుకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రెడ్‌క్రాస్ సభ్యుడు, రొటేరియన్ తోట సంపత్‌ను, వరంగల్ జిల్లా ఫోటోగ్రఫీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రొటేరియన్ వంగరి వేణుగోపాల్‌ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాయిని అనిల్ కుమార్, జూలూరి కృష్ణమూర్తి, అసిస్టెంట్ గవర్నర్ పోరాడ్ల రత్నాకర్, కుమారస్వామి, కోరే చంద్రమౌళి, కొడం రాజేందర్, సుంకనపల్లి శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.




