Warangal: వరంగల్ సీపీ శ్వేతను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్

Warangal: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఐపీఎస్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నూతన చైర్మన్ బేతి అశోక్ బాబు, పాలకవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 1 Oct 2026 9:24 PM IST
Warangal
X

Warangal: వరంగల్ సీపీ శ్వేతను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్

వరంగల్: సీపీ శ్వేత ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా నూతన చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ అధికారిణిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలు, భవిష్యత్‌లో నిర్వహించనున్న కార్యక్రమాల గురించి సీపీ శ్వేత ఐపీఎస్‌తో చర్చించారు. అనంతరం ఆమెను మర్యాదపూర్వకంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, ట్రెజరర్ బోల్లం శివ, ఎం.సి. సభ్యులు కుసుమ సత్యనారాయణ, మండల పరిష రాములు, వద్దిరాజు, పుల్లూరి ప్రవీణ్ కుమార్, తిరుపతి రెడ్డి, చొప్పరి సోమయ్య ముల్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST