Warangal: రెడ్‌క్రాస్ సేవలు విస్తరించాలి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Warangal: వరంగల్‌లో రెడ్‌క్రాస్ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశం. పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 22 Oct 2026 8:19 PM IST
Warangal
X

Warangal: రెడ్‌క్రాస్ సేవలు విస్తరించాలి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా తొలి మేనేజింగ్ కమిటీ (MC) సమావేశాన్ని గురువారం జిల్లా కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించనైనది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని వారు పేర్కొన్నారు. మానవత్వానికి మరో రూపం ఇండియన్ రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ గా సేవా దృక్పథం తో పనిచేయాలని సూచించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలకు, స్వచ్ఛంద సేవలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.

ప్రతి పౌరుడు రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకొని సమాజ సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మహిళా, శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

*వయోవృద్ధుల సంక్షేమానికి ‘ప్రణామ్’ కార్యక్రమం

వయోవృద్ధుల కోసం ‘ప్రణామ్’ కార్యక్రమం ద్వారా ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహించి, వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు *నషా ముక్త్ భారత్ – మాదకద్రవ్య రహిత వరంగల్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతకు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

అవసరంలో ఉన్న పేదలు, నిరుపేదలు, బాధితులకు రెడ్‌క్రాస్ సభ్యులందరూ సమన్వయంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వరంగల్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ

వరంగల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలని, ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో జనరిక్ మెడికల్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసి, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశంలో మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం మేరకు ఇ.వి. శ్రీనివాసరావును ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా సలహాదారుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

సమావేశంలో వరంగల్ జిల్లా ఎగగ్రీవంగా ఎంపిక చైర్మన్ బేతి అశోక్ బాబు, మేనేజింగ్ కమిటీ పరిచయం చేసినారు హనుమకొండ రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, జిల్లా గౌరవ సలహాదారు ఇ.వి. శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్‌కుమార్, రాష్ట్ర పాలక మండలి సభ్యులు నాడెం శాంతికుమార్, కోశాధికారి బొల్లం శివ, జిల్లా పాలక మండలి సభ్యులు మండల పరశురాములు, తోట సంపత్ కుమార్, చొప్పరి సోమయ్య, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, మోతె తిరుపతిరెడ్డి, డా. గజవెల్లి రాజ్‌కుమార్, ముల్క ప్రసాద్, వడ్డె రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్, సుమన్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత, సహాయ కార్మిక శాఖ అధికారి భార్గవ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ప్రజల ఆరోగ్యం, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ శాఖలు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు..

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST