Rayaparthy: మనోవేదనతో వృద్ధుడి మృతి: తిరుమలాయపల్లిలో ఉద్రిక్తత!
Rayaparthy: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో అప్పు వివాదంపై మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట వృద్ధుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
Rayaparthy: మనోవేదనతో వృద్ధుడి మృతి: తిరుమలాయపల్లిలో ఉద్రిక్తత!
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో అప్పు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన ముద్రబోయిన ముత్తయ్య (80) మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి మాజీ సర్పంచ్ గజవెల్లి అనంతప్రసాద్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
అనంతప్రసాద్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ముత్తయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ఈ క్రమంలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముత్తయ్య మృతికి అప్పు వ్యవహారమే కారణమని పేర్కొంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట నిర exసన తెలిపారు.
తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్తయ్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.




