Warangal: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బైలా సవరణకు ప్రత్యేక కమిటీ!
Warangal: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బైలా సవరణకు ప్రత్యేక కమిటీ నియామకం. కన్వీనర్‌గా పీవీ మదన్ మోహన్ నియామకం. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి ప్రకటన.
Warangal: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బైలా సవరణకు ప్రత్యేక కమిటీ!
Warangal: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బైలాన్ ను సవరణ చేసేందుకు కమిటీని నియమించినట్లు అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడు పీవీ మదన్ మోహన్ కన్వీనర్, వల్లాల వెంకటరమణ, బొక్క దయాసాగర్, సంగోజు రవి, తడక రాజనా రాయణ, కక్కెర్ల అనిల్ కుమార్, కంకణాల సంతోష్ లను సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 1991 నుంచి బైలా లో జరిగిన సవరణలకు చట్టబద్ధత లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. నివేదిక ఆధారంగా జనరల్ బాడీ ఆమోదం, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తదుపరి కార్యాచరణకు పూనుకుంటామని పేర్కొన్నారు.




