Warangal: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్!
Warangal: వరంగల్ జిల్లా ప్రజావాణిలో మొత్తం 153 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
Warangal: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్!
వరంగల్, అక్టోబర్ 12: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 153 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 47, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 42, డీఆర్‌డీఏకు 13 అర్జీలు రాగా వివిధ శాఖల నుండి 51అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత సమయంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రజావాణి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డియార్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ వసంత,హౌసింగ్ పిడి విష్ణు వర్ధన్ రెడ్డి, డీఎంఅండ్ హెచ్ ఓ రాజి రెడ్డి కలెక్టరేట్ సూపరిండెంట్ విశ్వప్రసాద్ తదితరులు ప్రజలు పాల్గొన్నారు.




