Warangal: అనుమానాస్పద లింకులు, నకిలీ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి!

Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ నుండి హనుమకొండ వరకు సైబర్ క్రైమ్ అవగాహన 'ఫ్లాష్ వాక్'. సీపీ ఎన్.శ్వేత ఐపీఎస్ పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 31 Oct 2026 7:21 AM IST
Warangal
X

Warangal: అనుమానాస్పద లింకులు, నకిలీ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి!

Warangal: సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, వారిని అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు కేయూ జంక్షన్ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు “ఫ్లాష్ వాక్” నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1,200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు

. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ సందేశాలు, మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమకు కలిగిన అవగాహనను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటూ సమాజంలో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.

ఫ్లాష్ వాక్ ద్వారా విద్యార్థులు సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తతే సైబర్ మోసాలకు అడ్డుకట్ట అనే సందేశాన్ని చాటిచెప్పారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీబీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, హన్మకొండ ఏసిపి నరసింహారావు, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, హనుమకొండ డివిజన్, వరంగల్ డివిజన్ లకు చెందిన ఇన్స్పెక్టర్ లు, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ ఎస్ఐలు మరియు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.