Parkal: పరకాలలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం!
Parkal: హనుమకొండ జిల్లా పరకాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు.
Parkal: పరకాలలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం!
Parkal: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భంగా పరకాల బస్టాండ్ సర్కిల్లో మరియు అంబేద్కర్ సెంటర్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ బ్యాండ్ బృందం బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ బృందం వాయిద్యాలతో ప్రజలను ఆకట్టుకుంది.
వృధా కాదు మీ మరణం మాసిపోదు మీ త్యాగం
పోలీస్ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అనే నినాదంతో " ప్రజల్లో అవగాహన కల్పించారు. అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ పరకాల సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై పవన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




