Parkal: పరకాలలో దుర్గమ్మ సన్నిధిలో డాక్టర్ కాళీ ప్రసాద్ రావు!
Parkal: పరకాల శ్రీ కనకదుర్గమ్మ-మదన పోచమ్మ ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా బీజేపీ నేత డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు.
Parkal: పరకాలలో దుర్గమ్మ సన్నిధిలో డాక్టర్ కాళీ ప్రసాద్ రావు!
పరకాల: పరకాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ–మదన పోచమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొలువుదీరిన అమ్మవారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు.
అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, సాదా మధుకర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




