Hanamkonda: పేదలకు ఆపన్నహస్తం సీఎం సహాయనిధి..వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య!

Hanamkonda: హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య 16 మంది లబ్ధిదారులకు రూ. 7.53 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 4:16 PM IST
Hanamkonda
X

Hanamkonda: పేదలకు ఆపన్నహస్తం సీఎం సహాయనిధి..వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య!

Hanamkonda: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి (CMRF) ఆపన్నహస్తంగా నిలుస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో భరోసానిస్తోందని పేర్కొన్నారు.

బుధవారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.7,53,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. అర్హులైన బాధితులు సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని అన్నారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఈ సందర్భంగా కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్