Warangal: వంగాల సమ్మిరెడ్డికి వేముల భూపాల్ బహిరంగ సవాల్
Warangal: వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ లావాదేవీలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ అధ్యక్షుడు సమ్మిరెడ్డికి ప్రస్తుత అధ్యక్షుడు వేముల భూపాల్ సవాల్ విసిరారు.
Warangal: వంగాల సమ్మిరెడ్డికి వేముల భూపాల్ బహిరంగ సవాల్
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వంగాల సమ్మిరెడ్డికి ప్రస్తుత అధ్యక్షుడు వేముల భూపాల్ సవాల్ విసిరారు. సంఘం లావాదేవీల వివరాలను సభ్యులకు తెలియజేయకుండా గతంలో రాజీనామా చేసి తప్పుకున్న సమ్మిరెడ్డి.. ప్రస్తుతం అదే సంఘంపై ప్రశ్నలు లేవనెత్తడం ఏమిటని భూపాల్ ప్రశ్నించారు.
ప్రస్తుతం సంఘం నిర్వహిస్తున్న లావాదేవీలకు సంబంధించిన లెక్కలను సభ్యుల ముందు చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో సమ్మిరెడ్డి హయాంలో లెక్కలు చూపకుండా తప్పుకున్నారని, ఆ లెక్కల వివరాలను కూడా లారీ యజమానులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
లెక్కలు వెల్లడించకపోతే సమ్మిరెడ్డి, సదానందం ఇళ్ల ముందు లారీ యజమానులతో కలిసి నిరసన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భూపాల్ తెలిపారు. కొంతమంది వ్యక్తులతో కలిసి లారీ యజమానులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేముల భూపాల్, కోశాధికారి ఎం.డి. జాకీర్‌తో పాటు పలువురు లారీ ఓనర్స్ పాల్గొన్నారు.




