Warangal: పట్టభద్రుల బరిలో బీజేపీ వ్యూహం: డా. వన్నాల వైపే మొగ్గు?

Warangal: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వన్నాల పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. బీసీ వర్గానికే అధిష్ఠానం మొగ్గు చూపుతోంది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 22 Oct 2026 4:27 PM IST
Warangal
X

Warangal: పట్టభద్రుల బరిలో బీజేపీ వ్యూహం: డా. వన్నాల వైపే మొగ్గు?

వరంగల్: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి సర్వోత్తమ్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

బీసీ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ అభ్యర్థిని నిలపాలని బీజేపీ యోచిస్తోంది. ఈ క్రమంలో సంఘ్ నేపథ్యం, సామాజిక సేవ చేస్తున్న డాక్టర్ వన్నాల పేరు ఉమ్మడి మూడు జిల్లాల్లో బలంగా వినిపిస్తోంది. పార్టీలో మెజారిటీ నేతలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST