Warangal: కాశీబుగ్గ మదర్ తెరిసా ఆశ్రమంలో అన్నదానం!
Warangal: వరంగల్ కాశీబుగ్గ మదర్ తెరిసా ఫౌండేషన్‌లో దివ్యాంగుల మధ్య బేతి మనోజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రెడ్ క్రాస్ చైర్మన్ అశోక్ బాబు అన్నదానం, పండ్ల పంపిణీ ప్రారంభించారు.
Warangal: కాశీబుగ్గ మదర్ తెరిసా ఆశ్రమంలో అన్నదానం!
వరంగల్: కాశిబుగ్గలోని మదర్ తెరిసా ఫౌండేషన్‌లో బేతి మనోజ్ఞ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడమే కాకుండా, దివ్యాంగుల మధ్య జరుపుకుంటూ వారికి అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, సేవాభావం, సాటి మనిషి పట్ల ప్రేమను పెంపొందిస్తాయని తెలిపారు.
సేవే మానవత్వానికి ప్రతిరూపం – పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తిని చాటిన బేతి మనోజ్ఞ ఈ కార్యక్రమంలో బేతి వీరలక్ష్మి బేతి రాజు బేతి శ్వేత బేతి శోభారాణి బేతి దివ్య బేతి సాయి బేతి నాని చారీ మదర్ తెరిసా ఫౌండేషన్ వారు తదితరులు పాల్గొన్నారు.




