Warangal: సారంగపాణి కుటుంబానికి రూ.57 వేల సాయం: స్నేహితుల దాతృత్వం!
Warangal: వరంగల్ కాశిబుగ్గకు చెందిన మూశం సారంగపాణి అకాల మరణంతో చిన్ననాటి మిత్రులు రూ.57,000 సేకరించి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ద్వారా కుటుంబానికి అందజేశారు.
Warangal: సారంగపాణి కుటుంబానికి రూ.57 వేల సాయం: స్నేహితుల దాతృత్వం!
వరంగల్: వరంగల్‌లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మూశం సారంగపాణి ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్ననాటి మిత్రులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కాశిబుగ్గకు చెందిన సారంగపాణి చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి రూ.57,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.
ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులను ఈ సందర్భంగా అభినందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు మనకు చేతనైన సహాయం అందించడం మానవత్వానికి నిదర్శనమని అశోక్ బాబు పేర్కొన్నారు.
స్నేహం అంటే కష్టకాలంలో తోడుగా నిలవడం అనే విషయాన్ని ఈ మిత్రులు మరోసారి నిరూపించారు. ఈ కార్యక్రమంలో లయన్ పోషల సురేందర్ దండు దయాసాగర్ రామ రమేష్ మహేందర్ యుగేందర్ వెంకన్న కృష్ణ జగన్ గోరంటల మనోహర్ మంతెన అమ్రేష్ పెద్ద ఎత్తున చిన్ననాటి మిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




